నీటి లెక్కలు తేల్చుకుందాం

CM KCR guidance for engineers about Krishna And Godavari Waters - Sakshi

రేపు కృష్ణా, ఎల్లుండి గోదావరి బోర్డుల భేటీ

ప్రస్తావించాల్సిన అంశాలపై ఇంజనీర్లకు సీఎం కేసీఆర్‌ మార్గదర్శనం

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ జలాలపై నెలకొన్న వివాదాలపై వాదనలను బలంగా వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వ సన్నద్ధమైంది. గత ట్రిబ్యునళ్ల తీర్పులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులు, దక్కాల్సిన వాటాలు, వినియోగి స్తున్న జలాలపై నివేదికలు సిద్ధం చేసుకుం ది. ఏపీ అభ్యంతరం చెబుతున్న ప్రాజెక్టుల పై వాదన వినిపించడంతోపాటు మళ్లింపు జలాల్లో దక్కే వాటాలపై ఈ నెల 4న జరి గే కృష్ణా బోర్డు, 5న జరిగే గోదావరి బోర్డు భేటీల్లో తేల్చుకోనుంది. అపెక్స్‌ కౌన్సిల్, బోర్డు అనుమతి లేదని చెబుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు, ఈ ఏడాదిలో ప్రాజెక్టుల్లో నీటి, విద్యుత్‌ పంపిణీ, బోర్డులకు రావాల్సిన నిధులు, సిబ్బంది కేటాయింపు అం శాలను బోర్డులు ఎజెండాలో చేర్చాయి.

సీఎం సూచనలు..: కృష్ణా, గోదావరి బోర్డు భేటీల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సీ ఎం కేసీఆర్‌ ఇంజనీర్లకు మార్గదర్శనం చే శారు. మంగళవారం ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీలు మురళీధర్, నాగేంద్రరావు, హరిరా మ్, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండేతో ఆయన సమీక్షించారు. గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రం లో ఇచ్చిన జీవోలను బోర్డు ముందు పెట్టాలని సూచించారు. గోదావరిలో 954 టీ ఎంసీల వినియోగంపై జరిగిన ఒప్పం దా లు, శ్రీకృష్ణ కమిటీలో పొందుపరిచిన అంశాలను ప్రస్తావిస్తూ ఆ కేటాయింపుల్లోంచే వినియోగించుకుంటున్నామనేది గట్టిగా చె ప్పాలన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల, దుమ్ముగూడెం, పాలమూరు, డిండి ప్రాజెక్టులనే రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రీఇంజనీరింగ్‌ చేయడాన్ని బోర్డుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ నరసింహారావు రచించిన ‘జల వివాదాల దరిమిలా వ్యవసాయ రంగాల ప్రాధాన్యం’, ‘భారతదేశ నదీ వివాదాల పంపిణీ ఒప్పందాలపై సమగ్ర వీక్షణం’ పుస్తకాలను కేసీఆర్‌ ఆవిష్కరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top