'మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ' | cm kcr floods reveiw meeting in karimnagar | Sakshi
Sakshi News home page

'మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ'

Sep 26 2016 5:34 PM | Updated on Aug 14 2018 10:59 AM

'మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ' - Sakshi

'మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ'

మిషన్ కాకతీయ పథకంతో చెరువులకు జలకళ వచ్చిందని సీఎం కేసీఆర్ చెప్పారు.

కరీంనగర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులకు జలకళ వచ్చిందని సీఎం కేసీఆర్ చెప్పారు. కరీంనగర్ జిల్లాలో సోమవారం ఆయన రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై  ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
 
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.... రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు దాదాపుగా నిండాయన్నారు. మిషన్ కాకతీయలో చేపట్టని 120 చెరువులకు గండ్లు పడ్డాయని... ఈ ఏడాది రబీ సీజన్కు ఢోకా లేదన్నారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. భారీ వర్షాలతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రాజెక్టుల నిర్వాసితులకు తక్షణ పరిహారం చెల్లించాలని కేసీఆర్ ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement