చంద్రబాబును తరిమికొట్టండి | chandra babu should send out | Sakshi
Sakshi News home page

చంద్రబాబును తరిమికొట్టండి

Jun 9 2015 3:55 AM | Updated on Aug 18 2018 6:05 PM

చంద్రబాబును తరిమికొట్టండి - Sakshi

చంద్రబాబును తరిమికొట్టండి

ఓటుకు నోటు కేసులో సూత్రధారి అయిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమి కొట్టాలని...

వైఎస్సార్ సీపీ గ్రేటర్ అధ్యక్షుడు ఆదం విజయ్‌కుమార్
తార్నాక:
ఓటుకు నోటు కేసులో సూత్రధారి అయిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమి కొట్టాలని వైఎస్సార్‌సీపీ గ్రేటర్ అధ్యక్షుడు ఆదం విజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మెట్టుగూడ చౌరస్తాలో చంద్రబాబు ఫ్లెక్సీని టమాటాలు, కోడిగుడ్లతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు.  అంతకు ముందుగా చంద్రబాబు ఫ్లెక్సీ బ్యానర్‌తో నిరసన ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదయం విజయ్‌కుమార్ మాట్లాడుతూ  ఎమ్మెల్సీ ఓటు కోసం ఏకంగా రూ. 5 కోట్లతో ఎమ్మెల్యేను కొనేందుకు ప్రయత్నించిన చంద్రబాబు 2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎన్ని కోట్లు వెచ్చించి ఎంతమంది ఎమ్మెల్యేలను కొని గద్దెనెక్కారని ప్రశ్నించారు. ఇటీవల ఆయన మాట్లాడిన మాటల సంభాషణలను సైతం ఏసీబీ అధికారులు విడుదల చేశారన్నారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ స్పందించి చంద్రబాబు సర్కారును బర్తరఫ్ చేయాలని కోరారు.

చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారంపై సిబిఐ చేత విచారణ జరపించాలన్నారు. అవి నీతి పచ్చ పార్టీకి చెందిన వారిని కేంద్ర మంత్రి వర్గం నుంచి తొలగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును అరెస్టు చేసే వరకు తమ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మోహన్, రమేష్, అమిత్‌ఠాకూర్, సేవాదళ్ నగర అధ్యక్షులు బండారి సుధాకర్, అశ్విన్‌కుమార్, ఆనంద్, వీర్‌సింగ్, రవికాంత్, మల్లిఖార్జున్, చిన్న, రాజుగౌడ్, సతీష్, చారి, జనార్థన్, చందు, సాయి, రాము, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement