'దోపిడీపై వివరణ ఇచ్చాకే బాబు పర్యటించాలి' | chandra babu give eplanation first then visit to telangana, says KTR | Sakshi
Sakshi News home page

'దోపిడీపై వివరణ ఇచ్చాకే బాబు పర్యటించాలి'

Feb 12 2015 3:33 AM | Updated on Jul 28 2018 6:35 PM

కృష్ణపట్నం, హిందుజా విద్యుత్ ప్లాంట్ల నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్‌ను ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్: కృష్ణపట్నం, హిందుజా విద్యుత్ ప్లాంట్ల నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్‌ను ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దోపిడీపై వివరణ ఇచ్చాకే చంద్రబాబు వరంగల్‌లో పర్యటించాలని మంత్రి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణకు ప్రాణాధారమైన సాగునీరు, విద్యుత్‌ను రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనను కర్ణాటక, కేరళ సీఎంల పర్యటనల మాదిరిగానే చూస్తామని, హైదరాబాద్‌లో ఉంటున్న అతిథిగానే భావిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement