సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వద్ద పీఏలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల డిప్యుటేషన్‌ను
నల్లగొండ టూటౌన్: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వద్ద పీఏలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల డిప్యుటేషన్‌ను వెంటనే రద్దు చేయాలని టీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కంకణాల లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండలోని ఆ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. డిప్యుటేషన్ద్ద్రు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో వారిని నియమించాలన్నారు.
కొంత మంది ఎంఈఓలు ఎమ్మార్సీలలో ఉపాధ్యాయులను అనధికారికంగా పనిచేయించుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం డీఈఓ చంద్రమోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి గణపురం భీమయ్య, కత్తుల యాదగిరి, వెంకటేశ్వర్‌రావు, రమేష్, అశోక్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.