ఎయిర్‌పోర్టులో 32 లైవ్ బుల్లెట్లు స్వాధీనం | bullets recovered at shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో 32 లైవ్ బుల్లెట్లు స్వాధీనం

Jan 10 2017 10:18 AM | Updated on Apr 7 2019 3:23 PM

ఎయిర్‌పోర్టులో 32 లైవ్ బుల్లెట్లు స్వాధీనం - Sakshi

ఎయిర్‌పోర్టులో 32 లైవ్ బుల్లెట్లు స్వాధీనం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఉదయం బుల్లెట్లు కలకలం రేపాయి.

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం ఉదయం బుల్లెట్లు కలకలం రేపాయి.  ఎయిర్‌పోర్టులో తనిఖీలలో రాజ్‌కుమార్ అనే వ్యక్తి నుంచి 32 లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తి వద్ద బుల్లెట్లు ఉండటంతో తోటి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్లు పోలీసుల విచారణలో ప్రయాణికుడు రాజ్‌కుమార్ తెలిపాడు. రాజ్‌కుమార్‌ హైదరాబాద్‌కు చెందినవాడని పోలీసులు వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement