చైనా మెప్పు కోసమే ఆ వ్యాఖ్యలు.. | BJP MLA Raja Singh Comments On Nepal PM KP Sharma Oli | Sakshi
Sakshi News home page

రాముని జన్మస్థలం ముమ్మాటికీ అయోధ్యే..

Jul 14 2020 4:21 PM | Updated on Jul 14 2020 4:26 PM

BJP MLA Raja Singh Comments On Nepal PM KP Sharma Oli - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నేపాల్‌ ప్రధాని కేపీ శ‌ర్మ ఓలీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అయోధ్య రామునిపై మాట్లాడే హక్కు నేపాల్‌ ప్రధానికి లేదన్నారు. రాముని జన్మస్థలం ముమ్మాటికీ అయోధ్యేనని ఆయన అన్నారు. చైనా మెప్పుకోసం నేపాల్ ప్రధాని లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ‘‘దమ్ముంటే నేపాల్ లో ఉన్న అనేక హిందూ దేవాలయాలను పునరుద్ధరించాలి. భారత్‌లో అనేక మంది నేపాల్  దేశస్తులు జీవిస్తున్నారు. ఇప్పటి వరకు నేపాల్కు భారత్ అండగా ఉంది కాబట్టే.. చైనా మిమ్మల్ని ఆక్రమించలేదు. లేదంటే ఎప్పుడో  నేపాల్పై చైనా నిజ స్వరుపాన్ని చూపేదని’’ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement