'అధైర్య పడవద్దు..అన్నివిధాలా ఆదుకుంటాం' | BJP leaders visit nalgonda distirict | Sakshi
Sakshi News home page

'అధైర్య పడవద్దు..అన్నివిధాలా ఆదుకుంటాం'

Apr 15 2015 9:18 AM | Updated on Sep 3 2017 12:20 AM

'అధైర్య పడవద్దు..అన్నివిధాలా ఆదుకుంటాం'

'అధైర్య పడవద్దు..అన్నివిధాలా ఆదుకుంటాం'

అకాల వర్షానికి నష్టపోయిన రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు.

భువనగిరి: అకాల వర్షానికి నష్టపోయిన రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు.  రైతులు అధైర్య పడవద్దని,  తర్వలోనే కేంద్రం నుంచి త్వరలోనే పరిహారం అందుతుందన్నారు. తెలంగాణలో అకాల వర్షాల వల్ల పంటలను నష్టపోయిన జిల్లాల్లో బీజేపీ నేతలు పర్యటిస్తున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి నియోజవర్గంలో వర్షాలకు నష్టపోయిన పంటలను బుధవారం  కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, మోహన్‌బాయ్ కంధారియా పరిశీలించారు. నియోజకవర్గం రేవులపల్లి, శివారెడ్డిగూడెం గ్రామాలలో పంటలను వారు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. చేతికొచ్చిన పంటను అకాల వర్షాలు ధ్వంసం చేశాయని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే పనికి రాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని ఈ సందర్భంగా మంత్రులు వారికి భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement