డివైడర్‌ను ఢీ కొన్న బైక్: ఇద్దరి మృతి | bike collisioned with devider and two died | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీ కొన్న బైక్: ఇద్దరి మృతి

Jun 12 2015 7:29 AM | Updated on Aug 25 2018 6:06 PM

వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టింది.

మిర్యాలగూడ(నల్లగొండ జిల్లా): వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం క్రిష్టాపురం గ్రామ సమీపంలో జరిగింది. వివరాలు.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఇరియాస్ (26), రాము (27) , మరో వ్యక్తిల కలిసి గురువారం అర్ధరాత్రి క్రిష్టాపురంలో జరిగిన ఒక వేడుకకు వెళ్లారు. 

శుక్రవారం తెల్లవారుజామున మిర్యాలగూడ నుంచి తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న బైక్ డివైడర్‌ను ఢీ కొట్టింది. అయితే, ఈ ఘటనలో ఇరియాస్, రాములిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని వెంటనే హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement