రైతుల కోసం ఉపవాస దీక్ష  | Bandi Sanjay Kumar Will Do Fasting For Farmers | Sakshi
Sakshi News home page

రైతుల కోసం ఉపవాస దీక్ష 

Apr 24 2020 1:21 AM | Updated on Apr 24 2020 1:21 AM

Bandi Sanjay Kumar Will Do Fasting For Farmers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతు సమస్యలు, కూలీల ఇబ్బందులను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి లాక్‌డౌన్‌ విధించడంతో కూలీలు దొరకక, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయక, ఐకేపీ సెంటర్లలో సరైన ఏర్పాట్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారం రోజులుగా బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement