రోడ్డుప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి | B.Tech student dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

Nov 23 2015 5:21 PM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వస్తున్న డీసీఎం.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో బైక్ పై ఉన్న ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.

ఘట్‌కేసర్ (రంగారెడ్డి) : వేగంగా వస్తున్న డీసీఎం.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో బైక్ పై ఉన్న ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం జోడిమెట్ల వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానిక వీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న కె. సందీప్(22) స్నేహితుడు సాయి కిరణ్‌తో కలిసి హోండా యాక్టీవాపై కళాశాలకు వెళ్లి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న సందీప్ అక్కడికక్కడే మృతిచెందగా.. సాయి కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement