కర్మాగారంలో ప్రమాదం: ఇద్దరు మృతి | Accident in Tirumala Oil company, Two dead and one injured | Sakshi
Sakshi News home page

కర్మాగారంలో ప్రమాదం: ఇద్దరు మృతి

Dec 12 2015 5:19 PM | Updated on Aug 28 2018 5:55 PM

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగలపల్లిలోని ఓ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.

ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగలపల్లిలోని ఓ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. గ్రామ సమీపంలోని తిరుమల ఆయిల్ కంపెనీలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో బాయిలర్‌లో పడి ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు బిహార్ రాష్ట్రానికి చెందినవారని సమాచారం. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ఒక మృతదేహాన్ని వెలికితీశారు. క్షతగాత్రుడిని హైదరాబాద్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement