బస్సు కింద పడి చిన్నారి మృతి | 5 years old boy dies in accident | Sakshi
Sakshi News home page

బస్సు కింద పడి చిన్నారి మృతి

Feb 22 2016 7:24 PM | Updated on Apr 3 2019 7:53 PM

స్కూల్ బస్సు నుంచి దిగిన విద్యార్థి ప్రమాదవశాత్తు అదే బస్సు కింద పడి మృతిచెందాడు.

ధర్మారం (నిజామాబాద్): స్కూల్ బస్సు నుంచి దిగిన విద్యార్థి ప్రమాదవశాత్తు అదే బస్సు కింద పడి మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం-బీ గ్రామంలోని ముదిరాజ్ వీధిలో సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన బత్తెల మహేష్ (5) సెయింట్ జోసఫ్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు.

రోజూ మాదిరిగానే సోమవారం కూడా స్కూల్ బస్సులో ఇంటి వద్ద దిగాడు. బస్సుకి క్లీనర్ లేకపోవడంతో డ్రైవర్ చూసుకోకుండా నడపడంతో బాలుడు బస్సు వెనుక టైర్ల కిందపడి అక్కడికక్కడి మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కొమురెల్లి, శిరీషలు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement