కాళేశ్వరంలో రికార్డు స్థాయిలో భక్తులు | 4 lakh devotees had holybath in kaleswaram | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంలో రికార్డు స్థాయిలో భక్తులు

Jul 25 2015 4:50 PM | Updated on Oct 30 2018 7:50 PM

కాళేశ్వరంలో రికార్డు స్థాయిలో భక్తులు - Sakshi

కాళేశ్వరంలో రికార్డు స్థాయిలో భక్తులు

కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరంలో రికార్డు స్థాయిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు.

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరంలో రికార్డు స్థాయిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడి పుష్కర ఘాట్లో 4 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికారులు భావిస్తున్నారు. గోదావరి పుష్కరాల చివరిరోజు కావడంతో త్రివేణి సంగమంగా ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరంలో పుష్కర ఘాట్లకు లక్షలాది భక్తులు పోటెత్తారు. ఈ రోజు సాయంత్రం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీలు కవిత, వినోద్, బాల్క సుమన్ గోదారి తల్లికి హారతి ఇవ్వనున్నారు. పద్మాదేవేందర్ రెడ్డి, కవిత శుక్రవారం రోజు ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో పుష్కర పనులను పరిశీలించారు. అనంతరం గోదారికి హారతి ఇచ్చిన విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement