చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి | 3 children died in adilabad district | Sakshi
Sakshi News home page

చెరువులో పడి ముగ్గురు చిన్నారుల మృతి

Dec 12 2015 7:55 PM | Updated on Sep 17 2018 8:02 PM

ఆడుకోవడానికి చెరువులోకి దిగిన ముగ్గురు చిన్నారులు నీటమునిగి మృతి చెందారు.

లక్ష్మణచందా: ఆడుకోవడానికి చెరువులోకి దిగిన ముగ్గురు చిన్నారులు నీటమునిగి మృతి చెందారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా లక్ష్మణచందా మండలం వడ్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు లక్కీ(10) బబ్లూ(7), రాజు(6) ఈరోజు చెరువు వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయారు. ఇది గుర్తించిన స్థానికులు వారి మృతదేహాలను  వెలికి తీశారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement