లారీ ప్రమాదం: నుజ్జునుజ్జైన చిన్నారులు | 2 children killed in road accident | Sakshi
Sakshi News home page

లారీ ప్రమాదం: నుజ్జునుజ్జైన చిన్నారులు

Mar 28 2016 2:18 PM | Updated on Aug 30 2018 4:07 PM

రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి వద్ద సోమవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి వద్ద సోమవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృత్యవాత పడ్డారు. వివరాలు... విజ్ఞాన్ జ్యోతి స్కూల్లో చదువుతున్న ఇద్దరు బాలికలను తాతయ్య స్కూటీపై ఇంటికి తీసుకెళుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన లారీ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీయ (10), హర్షిత (6) నుజ్జునుజ్జయి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. తాతయ్య బాలయ్య (65)కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తెగిపడిన అవయవాలతో ప్రమాద స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement