కరుణ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం | YS Jagan Mohan Reddy Shares Heartfelt Condolences For Karunanidhi | Sakshi
Sakshi News home page

కరుణ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Aug 7 2018 7:38 PM | Updated on Aug 8 2018 9:33 AM

YS Jagan Mohan Reddy Shares Heartfelt Condolences For Karunanidhi - Sakshi

కరుణానిధి మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) అధినేత ఎం. కరుణానిధి మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. కరుణ కుటుంబసభ్యులకు వైఎస్‌ జగన్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎన్నో ఒడిదుడుకుల నడుమ డీఎంకే పార్టీని ఏకతాటిపై నడిపిన కరుణ ప్రతిభ అమోఘమని కొనియాడారు.

అధి​కారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసం నిరంతరం శ్రమించిన కరుణానిధిని తమిళ ప్రజలు ఎన్నటికీ తమ హృదయాల్లో దాచుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ద్రవిడ రాజకీయాల్లో కరుణానిధి చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

Advertisement
 
Advertisement
Advertisement