నా 55 కోట్లు ఎక్కడ? | Where is my 55 crore? | Sakshi
Sakshi News home page

నా 55 కోట్లు ఎక్కడ?

Jul 31 2016 2:04 AM | Updated on Sep 5 2018 2:12 PM

తన బ్యాంకు ఖాతాలోని రూ. 55 కోట్లు ఏమయ్యాయంటూ ఓ వృద్ధురాలు బ్యాంకు శాఖకు తాళం వేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

బ్యాంకుకు తాళం వేసిన వృద్ధురాలు

 టీనగర్(చెన్నై) :
తన బ్యాంకు ఖాతాలోని రూ. 55 కోట్లు ఏమయ్యాయంటూ ఓ వృద్ధురాలు బ్యాంకు శాఖకు తాళం వేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరుపూర్ జిల్లా పాపినికి చెందిన అరుక్కాత్తాళ్(65)  కాంగేయంలోని భారత్ స్టేట్ బ్యాంకుకు తరచూ వచ్చి తన డబ్బెక్కడ అంటూ ఉద్యోగులను ప్రశ్నిస్తోంది.

గురువారంఉద్యోగులు లోపల ఉండగానే బ్యాంకుకు తాళం వేసి అక్కడే బైఠాయించింద్ని పోలీసులొచ్చి తాళం తీసి వారిని విడిపించారు. వృద్ధురాలిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారించి విడిచిపెట్టారు. మళ్లీ శుక్రవారం మధ్యాహ్నం తాళంతో వచ్చిన ఆమెను ఉద్యోగులు అడ్డుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement