సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చిన అగ్రీడ్ లిస్ట్ సిస్టం జీవో ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికారులు, ఉద్యోగులపై కక్ష సాధింపు కోసమే జీవో 1426 తీసుకవచ్చారని అధికారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ప్రాథమిక నివేదికల సాకుతో వేదించేందుకే జీవో తీసుకవచ్చారంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల హక్కుల కాలరాస్తూ, ఉద్యోగస్థులను వేధించేలా జీవో ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


