విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి | Two killed with an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

Sep 26 2016 11:33 AM | Updated on Sep 5 2018 2:25 PM

విద్యుధ్ఘాతానికి గురైన మహిళతో పాటు ఆమెను కాపాడేందుకు యత్నించిన మరో వ్యక్తికూడా కరెంట్ షాక్‌కు గురై మృతిచెందారు.

విద్యుధ్ఘాతానికి గురైన మహిళతో పాటు ఆమెను కాపాడేందుకు యత్నించిన మరో వ్యక్తికూడా కరెంట్ షాక్‌కు గురై మృతిచెందారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న పుష్ప(35) బీడీ కంపెనీలో కార్మికురాలిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఈరోజు కంపెనీలో పనికి వెళ్తున్న క్రమంలో కంపెనీ యజమాని ఎర్రన్న(48) ఇంటి సమీపంలో విద్యుధ్ఘాతానికి గురై కేకలు వేసింది. అది గుర్తించిన ఎర్రన్న ఆమెను కాపాడటానికి యత్నించే క్రమంలో ఆమెతో పాటు కరెంట్ తీగలకు అంటుకుపోయి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement