నగరంలోని సూరారం కాలనీ భగత్‌సింగ్ నగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
సూరారం కాలనీలో ఉద్రిక్తత
Sep 17 2016 11:41 AM | Updated on Aug 25 2018 5:38 PM
హైదరాబాద్: నగరంలోని సూరారం కాలనీ భగత్‌సింగ్ నగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికంగా ప్రతిష్టించిన వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తున్న సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన యువకులు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి భారీగా పోలీసులను మొహరించారు.
Advertisement
Advertisement