కుష్బూపై కేసు | Tamil Nadu police register cases against kushboo | Sakshi
Sakshi News home page

కుష్బూపై కేసు

Feb 4 2018 11:04 AM | Updated on Apr 3 2019 8:58 PM

Tamil Nadu police register cases against kushboo - Sakshi

సాక్షి, చెన్నై: సినీ నటి, కాంగ్రెస్‌ నాయకురాలు కుష్బూపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇచ్చిన సమయానికి కంటే ఎక్కువసేపు పార్టీ సమావేశం నిర్వహించినందుకు ఈ చర్య తీసుకున్నారు. నెల్లై జిల్లా, ముక్కూడల్‌లో శుక్రవారం రాత్రి జరిగిన రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పోలీసులు రాత్రి 10 గంటల వరకే ఈ సమావేశానికి అనుమతి ఇచ్చారు. సమయం ముగిసినా సమావేశం కొనసాగడంతో పోలీసులు కుష్బూ, నేతలపై ఐపీసీ 143, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రసాభాసగా సమావేశం
తమకు ఆహ్వానం అందలేదని మాజీ మంత్రి ధనుష్‌కోఠి ఆదిత్య సహా జిల్లా కాంగ్రెస్‌ నేతలు నిరసన చేపట్టారు. సీనియర్‌ నాయకులతో వాగ్వాదానికి దిగడంతో గందరగోళం రేగింది. ఆదిత్యకు నచ్చజెప్పి మొత్తానికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుష్బు మాట్లాడుతూ.. తాను పార్టీ అభివృద్ధికి కష్ట పడుతున్నానని, కొందరు అలా భావించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కలిసి రావాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement