ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ విమానాశ్రయాలు | Secondary and tertiary cities, airports | Sakshi
Sakshi News home page

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ విమానాశ్రయాలు

Sep 30 2014 2:38 AM | Updated on Aug 15 2018 2:20 PM

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ విమానాశ్రయాలు - Sakshi

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ విమానాశ్రయాలు

ప్రధాని నరేంద్ర మోడీ సలహా మేరకు దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో తక్కువ ఖర్చు, సదుపాయాల (నో ఫ్రిల్స్)తో కూడిన విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు...

  • కేంద్ర మంత్రి సిద్ధేశ్వర్
  • శివమొగ్గ : ప్రధాని నరేంద్ర మోడీ సలహా మేరకు దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో తక్కువ ఖర్చు, సదుపాయాల (నో ఫ్రిల్స్)తో కూడిన విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జీఎం. సిద్ధేశ్వర్ వెల్లడించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 50 నగరాల్లో ఇలాంటి విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు చెప్పారు.

    కర్ణాటకలో కూడా ఇలాంటి విమానాశ్రయాలను నిర్మించే ఆలోచన ఉందన్నారు. ఇతర విమానాశ్రయాలతో పోల్చితే వీటిల్లో వీవీఐపీ గదులు, ఎస్కలేటర్లు తదితర అత్యాధునిక  సదుపాయాలు ఉండవని వివరించారు. కనీస సౌకర్యాలతో విమానాశ్రయాలను నిర్మించాలన్నదే ఉద్దేశమని చెప్పారు. శివమొగ్గ, గుల్బర్గ, బెల్గాం, హాసన, మైసూరు విమానాశ్రయాల నిర్మాణం పూర్తయిన తర్వాత ఇతర నగరాలపై దృష్టి సారిస్తామన్నారు.

    శివమొగ్గలోని సోగాన గ్రామం వద్ద విమానాశ్రయం నిర్మాణ పనులు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల నిలిచిపోయాయని తెలిపారు. దీనిపై ఇటీవలే తాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చర్చించానని తెలిపారు. కాగా ఇదే సందర్భంలో మంత్రి  శివమొగ్గ విమానాశ్రయం నిర్మాణ తీరు తెన్నులపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప, రాజ్యసభ సభ్యుడు ఆయనూరు మంజునాథ్, ఎమ్మెల్యే శారదా పూర్యనాయక్, కలెక్టర్ వీపీ.ఇక్కేరితో పాటు వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో  పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement