breaking news
Siddhesvar
-
లారీ బోల్తా పడి ముగ్గురి దుర్మరణం
నిర్మల్(మామడ) : మామడ మండలంలోని బూరుగుపల్లి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ముకేష్ (24), దీప్‌చంద్ (20), ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భరత్ (20) మృతి చెందారు. వీరు ఫరిదాబాద్ నుంచి కర్నూల్‌కు లారీలో కొత్త ద్విచక్రవాహనాలను తీసుకెళ్తున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న లారీ బూరుగుపల్లి సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీ రోడ్డు పక్కనున్న రోలింగ్‌కు తగిలింది. బోల్తా పడిన తర్వాత దాదాపు వంద మీటర్ల వరకు దూసుకెళ్లింది. దీంతో లారీ డ్రైవర్ ముకేష్‌తోపాటు మరో ఇద్దరు లారీలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందారు. ఖానాపూర్ సీఐ నరేష్కుమార్, లక్ష్మణచాంద ఎస్సై నవీన్‌కుమార్, మామడ ఏఎస్సై సిద్ధేశ్వర్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను నిర్మల్‌కు తరలించారు. -
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ విమానాశ్రయాలు
కేంద్ర మంత్రి సిద్ధేశ్వర్ శివమొగ్గ : ప్రధాని నరేంద్ర మోడీ సలహా మేరకు దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో తక్కువ ఖర్చు, సదుపాయాల (నో ఫ్రిల్స్)తో కూడిన విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జీఎం. సిద్ధేశ్వర్ వెల్లడించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 50 నగరాల్లో ఇలాంటి విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు చెప్పారు. కర్ణాటకలో కూడా ఇలాంటి విమానాశ్రయాలను నిర్మించే ఆలోచన ఉందన్నారు. ఇతర విమానాశ్రయాలతో పోల్చితే వీటిల్లో వీవీఐపీ గదులు, ఎస్కలేటర్లు తదితర అత్యాధునిక సదుపాయాలు ఉండవని వివరించారు. కనీస సౌకర్యాలతో విమానాశ్రయాలను నిర్మించాలన్నదే ఉద్దేశమని చెప్పారు. శివమొగ్గ, గుల్బర్గ, బెల్గాం, హాసన, మైసూరు విమానాశ్రయాల నిర్మాణం పూర్తయిన తర్వాత ఇతర నగరాలపై దృష్టి సారిస్తామన్నారు. శివమొగ్గలోని సోగాన గ్రామం వద్ద విమానాశ్రయం నిర్మాణ పనులు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల నిలిచిపోయాయని తెలిపారు. దీనిపై ఇటీవలే తాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చర్చించానని తెలిపారు. కాగా ఇదే సందర్భంలో మంత్రి శివమొగ్గ విమానాశ్రయం నిర్మాణ తీరు తెన్నులపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప, రాజ్యసభ సభ్యుడు ఆయనూరు మంజునాథ్, ఎమ్మెల్యే శారదా పూర్యనాయక్, కలెక్టర్ వీపీ.ఇక్కేరితో పాటు వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.