భారీగా ఎర్రచందనం పట్టివేత | red sander caught in chittoor district | Sakshi
Sakshi News home page

భారీగా ఎర్రచందనం పట్టివేత

Dec 26 2016 12:44 PM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

చిన్నగొట్టిగల్లు: చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖాధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా కనికల కొండ వద్ద సుమారు 30 మంది ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడ్డారు. అటవీశాఖాధికారులను గమనించిన స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్కడే వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అధికారులు వెంబడించి ముగ్గురిని పట్టుకున్నారు. స్మగ్లర్లు వదిలేసిన 29 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు మమ్మురం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement