సోదరుడిని పరామర్శించిన రజనీకాంత్‌ | Rajinikanth Visit Apollo Hospital For His Brother | Sakshi
Sakshi News home page

సోదరుడిని పరామర్శించిన రజనీకాంత్‌

Aug 29 2019 9:16 AM | Updated on Aug 29 2019 9:17 AM

Rajinikanth Visit Apollo Hospital For His Brother - Sakshi

కర్ణాటక, యశవంతపుర : నటుడు రజనీకాంత్‌ బుధవారం బెంగళూరు వచ్చారు. శేషాద్రిపురంలోని అపోలో ఆస్పత్రిలో  సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్‌కు ఇటీవల మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్సజరిగింది. ఈనేపథ్యంలో రజనీకాంత్‌ వచ్చి ఆయన్ను పరామర్శించారు. కాగా రజనీకాంత్‌ను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అస్పత్రి వద్ద కోలాహలం నెలకొంది. అభిమానులు, వైద్య సిబ్బంది, వైద్యులు రజనీకాంత్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.


Advertisement
 
Advertisement
Advertisement