పింఛన్ ధ్రువీకరణ పంపిణీ | pension Certification Documents Distribution | Sakshi
Sakshi News home page

పింఛన్ ధ్రువీకరణ పంపిణీ

Dec 28 2013 3:31 AM | Updated on Oct 16 2018 7:36 PM

తిరువళ్లూరు మున్సిపాలిటీ పరిధిలోని పెరుంబాక్కం ప్రాంతంలో 40మంది వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ల ధ్రువీకరణ పత్రాన్ని మున్సిపాలిటి చైర్మన్ భాస్కరన్

తిరువళ్లూరు, న్యూస్‌లైన్:తిరువళ్లూరు మున్సిపాలిటీ పరిధిలోని పెరుంబాక్కం ప్రాంతంలో 40మంది వృద్ధులకు వృద్ధాప్య పింఛన్ల ధ్రువీకరణ పత్రాన్ని మున్సిపాలిటి చైర్మన్ భాస్కరన్ అందజేశారు. తిరువళ్లూరులో జరిగిన కార్యక్రమాన్ని కమిషన ర్ అక్షయ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథి గా ఛైర్మన్ భాస్కరన్ హజరయ్యారు. ఈ సందర్భంగా పెరుంబాక్కంలో కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లును ఆయన ప్రారంభించారు. అనంతరం వృద్ధులు, వితంతువులు, వికలాం గులకు పింఛన్ ధ్రువీకరణ పత్రాలు అందజేశా రు. చైర్మన్ భాస్కరన్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ లబ్ధిదారుల ఎంపికలో నిష్పక్షపాతంగా వ్యవహరిం చినట్టు తెలిపారు. వైస్ చైర్మన్ రాధాకృష్ణన్‌తో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement