ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య | Mother Commits suicide with two children in Warangal | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

Sep 10 2016 3:05 PM | Updated on Sep 4 2017 12:58 PM

ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

భర్త తీరుతో ఆవేదన చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకుంది.

హన్మకొండ: భర్త తీరుతో ఆవేదన చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకుంది. హన్మకొండ మిలీనియం కాలనీలో శనివారం ఈ విషాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన శోభన్‌బాబు, ఉమ దంపతులకు సోని(12), కౌశిక్(8) అనే ఇద్దరు పిల్లలున్నారు. ఉమ కుట్టుపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండగా శోభన్‌బాబు జులాయిగా తిరుగుతుంటాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
 
ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం భార్య, పిల్లలపై చేయిచేసుకున్న శోభన్‌బాబు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తను తిరిగి వచ్చేసరికి ఇంట్లోనే ఉంటే చంపుతానని ఉమను బెదిరించాడు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న ఉమ శనివారం వేకువజామున ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను తాగి మరణించింది. ఉదయమైనా ఎంతకీ తలుపు తీయకపోయేసరికి చుట్టుపక్కల వారు వచ్చి చూడగా ముగ్గురూ మృతి చెంది ఉన్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement