వానరాన్ని చిత్ర హింసలు పెట్టిన అనంతరం పూడ్చి పెట్టిన కేసులో విద్యార్థుల వద్ద పోలీసులు విచారణ చేపట్టారు.
వేలూరు: వానరాన్ని చిత్ర హింసలు పెట్టిన అనంతరం పూడ్చి పెట్టిన కేసులో విద్యార్థుల వద్ద పోలీసులు విచారణ చేపట్టారు. వేలూరు బాగాయంలోని సీఎంసీ వసతి గృహంలోకి వచ్చిన ఓ వానరాన్ని పట్టుకుని చిత్రహింసలకు గురిచేసిన అనంతరం దాన్ని పూడ్చి పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై మూగజీవాల సంరక్షణా సలహాదారుడు సిలవన్ క్రిష్ణన్ ఫిర్యాదు మేరకు వానరం కళేబరాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేపట్టిన అధికారులు చిత్రహింసలు పెట్టిన విషయాన్ని నిర్ధారించారు. దీంతో సదరు విద్యార్థులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారి వద్ద విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా ఈ నలుగురు విద్యార్థులను విచారించేందుకు అటవీ అధికారులు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అరుుతే అటవీ శాఖ పరిసరాల్లో కాకుండా వేరే చోట ఈ సంఘటన చోటుచేసుకుని ఉండడం వల్ల కేసును తమకు అప్పగించాలని పోలీసులను వారు కోరుతున్నారు. ఈ మేరకు పోలీసులకు లేఖ రాసిన అటవీ అధికారులు కేసును తమకు అప్పగిస్తే అటవీ ప్రాంత మూగ జీవాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.