ఎమ్మెల్యేలూ.. వెంటనే రిసార్ట్ ఖాళీ చేయండి | leave golden bay resort, police says to mlas | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలూ.. వెంటనే రిసార్ట్ ఖాళీ చేయండి

Feb 15 2017 3:36 PM | Updated on May 24 2018 12:08 PM

ఎమ్మెల్యేలూ.. వెంటనే రిసార్ట్ ఖాళీ చేయండి - Sakshi

ఎమ్మెల్యేలూ.. వెంటనే రిసార్ట్ ఖాళీ చేయండి

అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బసచేసిన కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్‌ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.

చెన్నై: అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బసచేసిన కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్‌ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. రిసార్ట్‌ను వెంటనే ఖాళీ చేయాలని ఎమ్మెల్యేలకు పోలీసులు సూచించారు. శశికళ, పళనిస్వామి తనను కిడ్నాప్ చేశారని ఎమ్మెల్యే శరవణన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గోల్డెన్ బే రిసార్ట్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాంచీపురం ఎస్పీ రిసార్ట్ వద్దకు చేరుకుని విచారిస్తున్నారు. ఎమ్మెల్యేలు వెంటనే రిసార్ట్‌ను ఖాళీ చేసి వెళ్లాలని సూచించారు. పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

శశికళ వర్గం ఎమ్మెల్యేలతో కలసి శరవణన్ నిన్నటివరకు రిసార్ట్‌లో ఉన్నారు. ఆయన రిసార్ట్ నుంచి తప్పించుకుని వచ్చి తనను శశికళ, అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత పళనిస్వామి కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శశికళ, పళనిస్వామిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


Advertisement
 
Advertisement
Advertisement