శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే | kidnap case filed on sasikala and palanisamy on mla complaint | Sakshi
Sakshi News home page

శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే

Feb 15 2017 1:36 PM | Updated on Sep 5 2017 3:48 AM

శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే

శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే

శశికళ చెన్నై నగరాన్ని వీడి బెంగళూరుకు అలా బయల్దేరారో లేదో.. ఆమె మీద ఒక కిడ్నాప్ కేసు నమోదైంది.

శశికళ చెన్నై నగరాన్ని వీడి బెంగళూరుకు అలా బయల్దేరారో లేదో.. ఆమె మీద ఒక కిడ్నాప్ కేసు నమోదైంది. శశికళతో పాటు ప్రస్తుతం ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన మంత్రి పళనిసామి మీద కూడా కలిపి ఈ కేసు నమోదు చేశారు. తనను వీళ్లిద్దరూ కలిసి కిడ్నాప్ చేశారంటూ దక్షిణ మదురై ఎమ్మెల్యే శరవణన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూవత్తూరు పోలీసు స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.
 
అయితే ఇంతకుముందు చెన్నై పోలీసులు కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లి అక్కడ తాము ప్రతి ఎమ్మెల్యేతోను మాట్లాడామని, మొత్తం 112 మంది ఎమ్మెల్యేలు తాము స్వచ్ఛందంగానే వచ్చినట్లు చెప్పారంటూ హైకోర్టుకు ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. మరి ఇప్పుడు ఈ ఫిర్యాదు ఎలా వచ్చిందో చూడాలి. కాగా గోల్డెన్ బే రిసార్టు నుంచి ఎమ్మెల్యే శరవణన్ పారిపోయి బయటకు వచ్చారు. ఆయన పన్నీర్ సెల్వానికి మద్దతు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement