ప్రభుదేవాకు వల | kutty radhika try to choreographer prabhu deva Role in i hate days movie | Sakshi
Sakshi News home page

ప్రభుదేవాకు వల

May 12 2015 3:01 AM | Updated on Apr 3 2019 6:23 PM

ప్రభుదేవాకు వల - Sakshi

ప్రభుదేవాకు వల

ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా తెరపై కనిపించి చాలా రోజులైంది. దర్శకుడిగా బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు.

ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా తెరపై కనిపించి చాలా రోజులైంది. దర్శకుడిగా బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. అదేవిధంగా నటి కుట్టి రాధిక చాలాకాలం తర్వాత నటించడం మొదలెట్టారు. ఇంతకుముందు ఇయర్కై, మీసై మాధవన్ తదితర చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని ప్రేమించి పెళ్లాడి నటనకు దూరమయ్యారు. అలాంటిది ఆమె మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు.
 
  అంతేకాదు ఈసారి నిర్మాతగా కూడా మారుతున్నారు. కన్నడంలో లక్కి, నన్నాజోడి, ఐహేట్ డేస్ తదితర మూడు చిత్రాలను నిర్మించతలపెట్టారు. వీటిలో ఐ హేట్ డేస్ చిత్రంలో నృత్యానికి ప్రాముఖ్యత ఉంటుందట. ఇందులో ఆమె నృత్యభరిత పాత్రను పోషించనున్నారు. నవంబర్‌లో తన పుట్టిన రోజున ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెల్లడించనున్నారు. ఈ చిత్రంలో హీరో కోసం బాలీవుడ్ నటులు కొందరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ పట్టికలో నటుడు, దర్శకుడు ప్రభుదేవా కూడా ఉన్నారట. ప్రభుదేవా అంగీకరిస్తే ఐ హేట్ డేస్ చిత్రం బహుభాషా చిత్రం అవుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement