breaking news
choreographer prabhu deva
-
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. స్టార్ కొరియోగ్రాఫర్ ఎంట్రీ!
టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఇటీవలే ఈ మూవీ రెండో షెడ్యూల్‌ను న్యూజిలాండ్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాలో ఇండియాలోని ప్రముఖ స్టార్స్ భాగం కానున్నారు. టాప్ టెక్నీషియన్స్ అంతా కూడా కన్నప్ప కోసం పని చేస్తున్నారు. అయితే కన్నప్ప మూవీకి ఇండియన్ టాప్ కొరియెగ్రాఫర్, ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభు దేవా రంగంలోకి దిగారు. కన్నప్ప సినిమాలోని పాటలకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ప్రభు దేవాకు కన్నప్ప టీం స్వాగతం పలికింది. ఇండియాలోనే స్టార్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా 'కన్నప్ప' సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ప్రభుదేవా రాకతో కన్నప్ప సినిమా రేంజ్ మరో లెవెల్‌కు వెళ్లింది. ప్రభు దేవా కొరియోగ్రఫీ ఈ సినిమాకు మరింత ప్లస్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం న్యూజిలాండ్, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లు షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. మహా భారతం సీరియల్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు. #Prabhudeva joins @iVishnuManchu on #Kannappa shoot in #NewZealand pic.twitter.com/StgCcLO3Os — FridayWall Films (@FridayWallMag) March 4, 2024 -
ప్రభుదేవాకు వల
ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా తెరపై కనిపించి చాలా రోజులైంది. దర్శకుడిగా బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. అదేవిధంగా నటి కుట్టి రాధిక చాలాకాలం తర్వాత నటించడం మొదలెట్టారు. ఇంతకుముందు ఇయర్కై, మీసై మాధవన్ తదితర చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని ప్రేమించి పెళ్లాడి నటనకు దూరమయ్యారు. అలాంటిది ఆమె మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అంతేకాదు ఈసారి నిర్మాతగా కూడా మారుతున్నారు. కన్నడంలో లక్కి, నన్నాజోడి, ఐహేట్ డేస్ తదితర మూడు చిత్రాలను నిర్మించతలపెట్టారు. వీటిలో ఐ హేట్ డేస్ చిత్రంలో నృత్యానికి ప్రాముఖ్యత ఉంటుందట. ఇందులో ఆమె నృత్యభరిత పాత్రను పోషించనున్నారు. నవంబర్‌లో తన పుట్టిన రోజున ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెల్లడించనున్నారు. ఈ చిత్రంలో హీరో కోసం బాలీవుడ్ నటులు కొందరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ పట్టికలో నటుడు, దర్శకుడు ప్రభుదేవా కూడా ఉన్నారట. ప్రభుదేవా అంగీకరిస్తే ఐ హేట్ డేస్ చిత్రం బహుభాషా చిత్రం అవుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.