'హైదరాబాద్ తరహాలో ఆధునీకరిస్తాం' | karimnagar cp kamalasan reddy starts family counseling center | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్ తరహాలో ఆధునీకరిస్తాం'

Oct 18 2016 12:09 PM | Updated on Aug 21 2018 9:20 PM

హైదరాబాద్ తరహాలో కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లను ఆధునీకరిస్తామని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.

జమ్మికుంట: హైదరాబాద్ తరహాలో కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లను ఆధునీకరిస్తామని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం నిధుల కేటాయింపులు తక్కువగా ఉన్నందున దశలవారీగా ఆధునీకరణ పనులను చేపడతామని చెప్పారు. మంగళవారం ఆయన జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలిగేలా చేస్తామన్నారు.
 
నేరాల సంఖ్య తగ్గిస్తామన్నారు. పోలీసులకు మరిన్ని సౌకర్యాలు కల్పించటంతో పాటు వారిలో ఆత్మస్థైర్యం పెంచేందుకు కృషి చేస్తామన్నారు. వ్యాపార వర్గాల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐలు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement