రోడ్డు ప్రమాదంలో పత్రికా విలేకరి మృతి | Journalist killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పత్రికా విలేకరి మృతి

Oct 21 2013 6:56 AM | Updated on Sep 1 2017 11:50 PM

వేలూరు, న్యూస్‌లైన్: ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుక వైపు నుంచి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో పత్రికా విలేకరి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి వేలూరులో చోటు చేసుకుంది.

వేలూరు, న్యూస్‌లైన్: ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుక వైపు నుంచి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో పత్రికా విలేకరి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి వేలూరులో చోటు చేసుకుంది. సేలం జిల్లా మోటూరు సమీపంలోని కరంగాల్‌పాడి గ్రామానికి చెందిన శశికుమార్(30) వేలూరు జిల్లా జూనియర్ విగడన్ పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. 
 
 శనివారం రాత్రి విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంలో ఇంటికి బయల్దేరాడు. అదే సమయంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శశికుమార్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సత్‌వచ్చారి పోలీసులు కేసు నమోదు చేశారు. టిప్పర్ డ్రైవర్ శరవణన్‌ను అరెస్ట్ చేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సేలం నుంచి ఆదివారం ఉదయం ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకుని బోరున విలపించారు.

Advertisement
 
Advertisement
Advertisement