జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి | Jayalalitha is fine, says prathap c reddy | Sakshi
Sakshi News home page

జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి

Nov 12 2016 12:56 PM | Updated on Sep 4 2017 7:55 PM

జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి

జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి చెప్పారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి చెప్పారు. ఐసీయూ నుంచి ఆమెను త్వరలో స‍్పెషల్‌ రూమ్‌కు మారుస్తామని తెలిపారు. జయలలిత ఎప్పుడు కోరితే అప్పుడు డిశ్చార్జి చేస్తామని ప్రతాప్‌ సి రెడ్డి చెప్పారు.

సెప్టెంబర్ 22 నుంచి జయలలిత అపోలోలో చికిత్స పొందుతున్నారు. మొదట్లో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చినా, క్రమేణా కోలుకున్నారు. పలువురు వీఐపీలు ఆపోలో ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement