దళితుల సంక్షేమానికి జగ్జీవన్‌రాం కృషి | jagjivan ram birthday celebrations in guntur | Sakshi
Sakshi News home page

దళితుల సంక్షేమానికి జగ్జీవన్‌రాం కృషి

Apr 5 2017 2:48 PM | Updated on Aug 14 2018 11:26 AM

బాబూ జగ్జీవన్‌రామ్‌ దళితుల కోసం ఎంతగానో పాటుపడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

గుంటూరు: బాబూ జగ్జీవన్‌రామ్‌ దళితుల కోసం ఎంతగానో పాటుపడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరులో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొని మార్కెట్‌ సెంటర్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి, విశిష్టమైన నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి జగ్జీవన్‌రామ్‌ అని కొనియాడారు.  కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, జవహర్‌, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి, ముస్తఫా, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement