ఆప్‌లో అంతర్గత విభేదాలు | Internal conflict in Aam Aadmi Party | Sakshi
Sakshi News home page

ఆప్‌లో అంతర్గత విభేదాలు

Jan 19 2015 11:58 PM | Updated on Apr 4 2018 7:42 PM

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఉత్తర ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఆదివారం

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఉత్తర ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఓ సమావేశంలో చోటుచేసుకున్న ఘటన దీనిని ప్రతిబింబిస్తోంది. ప్రస్తుత విధానసభ ఎన్నికల్లో పార్టీ తరఫున రోహిణీ నియోజక వర్గంనుంచి రాజేష్‌గార్గ్‌ను తప్పించి ఆయన స్థానంలో చరంజీలాల్ గుప్తాకు అధిష్టానం టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన సమావేశానికి హాజరైన ఆశుతోష్‌ను... గార్గ్ వర్గీయులు అడ్డుకున్నారు. తమ ప్రశ్నలకు జవాబివ్వాలంటూ గద్దించారు. దీంతో ఆయన తప్పించుకునేందుకు యత్నించాడు. కొందరు గూండాలు ఆయనను తిరిగి వేదికపైకి బలవంతంగా తీసుకొచ్చారు.
 
 ఈ సందర్భంగా గార్గ్ మాట్లాడుతూ ‘దేనిని గురించి భయపడుతున్నాడు. వాస్తవాలను ఆలకించేందుకు అతనికి దమ్ము ఉండాలి’అని అన్నారు. అయితే ఈ ఘటనను అధిష్టానం ఖండించింది. ఈ విషయమై ఆశుతోష్ మాట్లాడుతూ ‘కొద్ది గందరగోళం చోటుచేసుకున్న మాట నిజమే. నిన్న నేను... నా మాజీ సహచరుడు రాజేష్ వద్దకు వెళ్లా. అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో కోపంగా ఉన్నాడు. ఆ సమయంలో అతని అనుచరులు కూడా ఉన్నారు. దీంతో హంగామా చేసేందుకు యత్నించాడు. అయితే ఇందులో ఆగ్రహానికి లోనవడానికేమీ లేదు’ అని అన్నారు. రాజేష్...కొద్దిగా అసహనంగా కనిపించాడు. దీంతో అక్కడ ఉండాలనిపించలేదు. వచ్చేశా’ అని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement