రెండేళ్ల తర్వాత ఆకాష్తో సినిమా: పూరీ | hero oriented film with akash says puri jagannath | Sakshi
Sakshi News home page

రెండేళ్ల తర్వాత ఆకాష్తో సినిమా: పూరీ

Oct 2 2016 8:56 AM | Updated on Mar 22 2019 1:53 PM

రెండేళ్ల తర్వాత ఆకాష్తో సినిమా: పూరీ - Sakshi

రెండేళ్ల తర్వాత ఆకాష్తో సినిమా: పూరీ

తన కుమారుడు ఆకాష్ పూరీ పూర్తిస్థాయి హీరోగా రెండేళ్ల తర్వాత సినిమా తీయనున్నట్టు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలిపారు.

కోటవురట్ల: తన కుమారుడు ఆకాష్ పూరీ  పూర్తిస్థాయి హీరోగా రెండేళ్ల తర్వాత సినిమా తీయనున్నట్టు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలిపారు. కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఆయన శుక్రవారం రాత్రి మండలంలోని బి.కె.పల్లికి వచ్చారు. శనివారం తిరిగి హైదరాబాద్‌కు వెళుతూ విలేకరులతో మాట్లాడారు. కుమారుడు ఆకాష్ బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడన్నారు.
 
 నటనపై ఆసక్తి ఉండడంతో పూర్తిస్థారుు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం నటనకు సంబంధించి అన్ని విభాగాల్లో విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నాడని తెలిపారు. శిక్షణ పూర్తరుున తర్వాత తన దర్శకత్వంలోనే మంచి సినిమా చేస్తాడని చెప్పారు. తాను ఇప్పటి వరకు 33 సినిమాలు తీశానని, తాను చేసిన సినిమాలన్నీ సంతృప్తిని ఇచ్చినవే అన్నారు.

పోకిరి, టెంపర్  చిత్రాలు ఆనందాన్ని ఇచ్చాయన్నారు.ప్రస్తుతం కళ్యాణ్‌రామ్‌తో చేసిన ఇజం సినిమా ఈ నెలాఖరుకు విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రాన్ని కుటుంభ సభ్యులతో కలిసి నర్సీపట్నంలో వీక్షించనున్నట్టు చెప్పారు. తదుపరి మహేష్‌బాబు,  ఎన్టీఆర్‌లతో చిత్రాలు చేయనున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement