ఇంధనశాఖ మంత్రికి షాక్ | Fuel department minister shock | Sakshi
Sakshi News home page

ఇంధనశాఖ మంత్రికి షాక్

May 5 2016 3:20 AM | Updated on Sep 18 2018 8:28 PM

ఇంధనశాఖ మంత్రి డీ.కే.శివకుమార్‌కు రాష్ర్ట విద్యుత్ శాఖ షాక్‌ఇచ్చింది. ఆయన మీడియా సమావేశం సమయంలో...

మీడియా సమావేశంలో పవర్‌కట్
 

 సాక్షి,బెంగళూరు: ఇంధనశాఖ మంత్రి డీ.కే.శివకుమార్‌కు రాష్ర్ట విద్యుత్ శాఖ షాక్‌ఇచ్చింది. ఆయన మీడియా సమావేశం సమయంలో ఉండగా పవర్ పోయింది. ఈ ఘటన విధానసౌధలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు...రాష్ట్రంలో ఎక్కడా కూడా విద్యుత్‌కోతలు లేవని డీ.కే శివకుమార్ మీడియా సమావేశంలో చెబుతున్న సమయంలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అక్కడ ఉన్న పాత్రికేయులతో పాటు అమాత్యుడు కూడా నవ్వారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ సౌరవిద్యుత్ కొనుగోలు కోసం నెట్‌మీటర్ వ్యవస్థ అందుబాటులో ఉండేదని ఇప్పటి నుంచి ఆ స్థానంలో గ్రాస్‌మీటరింగ్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు.  ప్రతి యూనిట్ విద్యుత్‌ను రూ.7.8 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయనుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement