మద్యం బాటిల్లో కప్ప | Frog Find in Alcohol Bottle in Tamil nadu | Sakshi
Sakshi News home page

మద్యం బాటిల్లో కప్ప

May 11 2020 7:21 AM | Updated on May 11 2020 7:21 AM

Frog Find in Alcohol Bottle in Tamil nadu - Sakshi

మద్యం సీసాలో చనిపోయిన కప్ప

మద్యం బాటిల్‌లో కప్ప కనిపించడం స్థానికంగా సంచలనం కలిగించింది.

చెన్నై,టీ.నగర్‌: మైలాడుదురై జిల్లా, శీర్గాళిలో మద్యం బాటిల్‌లో కప్ప కనిపించడం స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాలు ఆదివారం వెళ్లడయ్యాయి. శీర్గాళి ఈశాన్య వీధిలో ప్రభుత్వ టాస్మాక్‌ షాపు ఉంది. తెన్‌పాదికి చెందిన కొందరు శుక్రవారం సాయింత్రం ఇక్కడ మద్యం సీసాలను కొనుగోలు చేశారు. పొలంలోకి వెళ్లిన  తర్వాత క్వార్టర్‌ బాటిల్‌ తెరిచి చూడగా.. అందులో ఓ కప్ప చనిపోయి కనిపించింది. దిగ్భ్రాంతి చెందిన వారు మద్యాన్ని కింద పారపోశారు.

రమ్‌ బాటిల్లో కప్ప కనిపించిన సమాచారం టాస్మాక్‌ షాపు ఉద్యోగులకు తెలిసింది. దీంతో ఈ విషయం బయటకు పొక్కకుండా వారి వద్ద నుంచి మద్యం సీసాను వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది. మద్యం సీసాలో కప్ప కనిపించడం గురించి జిల్లా టాస్మాక్‌ మేనేజర్‌ అంబికాపతిని ప్రశ్నించగా ఇంతవరకు తమ దృష్టికి ఈ సమాచారం అందలేదని, పూర్తిగా పరీక్షలు జరిపిన తరువాతే మద్యం బాటిళ్లను విక్రయాలకు అనుమతిస్తున్నస్తున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement