గోడౌన్లో మంటలు: నలుగురు సజీవ దహనం | Four killed in fire accident in thiruvallur | Sakshi
Sakshi News home page

గోడౌన్లో మంటలు: నలుగురు సజీవ దహనం

Aug 21 2014 9:00 AM | Updated on Sep 5 2018 9:45 PM

ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు చెలరేగి నలుగురు కార్మికులు సజీవ దహనమైన సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

చెన్నై: ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు చెలరేగి నలుగురు కార్మికులు సజీవ దహనమైన సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి ... భారీ ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దాంతో భద్రత సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు.

ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సజీవ దహనమైన కార్మికులు గోడౌన్లో నిద్రిస్తుండగా ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement