చెట్టును ఢీకొన్న కారు | Four died in road accident | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న కారు

Mar 16 2017 2:42 AM | Updated on Aug 30 2018 4:10 PM

చెట్టును కారు ఢీకొన్న ప్రమాదంలో తండ్రి,కుమార్తె సహా నలుగురు మృతిచెందారు. ఈ సంఘటన తెన్‌పసియారు సమీపంలో చోటుచేసుకుంది.

అన్నానగర్‌: చెట్టును కారు ఢీకొన్న ప్రమాదంలో తండ్రి,కుమార్తె సహా నలుగురు మృతిచెందారు. ఈ సంఘటన తెన్‌పసియారు సమీపంలో చోటుచేసుకుంది. రామనాథపురం జిల్లా సాయల్‌కుడి సమీపంలో ఉన్న ఎస్‌.దురైపాండి గ్రామానికి చెందిన మారిసెల్వం (52). ఇతను కుటుంబంతో కలిసి ఆంధ్రాలో ఉన్న తన ఇంటికి వెళ్లాలని కారులో బయలుదేరారు. వారితో పాటు బంధువులైన శాంతి, పుష్పలను కూడా తీసుకువెళ్లారు. చెన్నై– తిరుచ్చి హైవే రోడ్డులో వెళుతుండగా  తెన్‌పసియారు బస్టాండ్‌ సమీపంలో అదుపుతప్పిన కా రు చెట్టును ఢీకొని, రోడ్డుపక్కన ఉన్న గుంతలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మారిసెల్వం, దివ్య, శాంతి, పుష్ప సంఘటన స్థలంలోనే మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు ఈ ప్రమాదంపై విచారణ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement