కాంగ్రెస్కు మాజీ సీఎం గుడ్‌ బై | Former Chief Minister of Karnataka and senior Congress leader SM Krishna resigns from Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్కు మాజీ సీఎం గుడ్‌ బై

Jan 28 2017 7:09 PM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్కు మాజీ సీఎం గుడ్‌ బై - Sakshi

కాంగ్రెస్కు మాజీ సీఎం గుడ్‌ బై

కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ పార్టీకి గుడ్‌ బై చెప్పారు.

బెంగళూరు: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. కాంగ్రెస్ వర్కింట్‌ కమిటీకి, పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. శనివారం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. ఆదివారం బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.

1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎస్ఎం కృష్ణ పనిచేశారు. 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్గా,  2009 నుంచి 2012 వరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో విభేదాల వల్లే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Advertisement
 
Advertisement
Advertisement