ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం
భివండీ పట్టణంలో ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన శనివారం చోటుచేసుకుంది.
	ముంబై:  భివండీ పట్టణంలో ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... భివండీ వాసి అయిన 62 యేళ్ల వృద్ధుడు సాయంత్రం అదే ప్రాంతంలో నివసించే ఎనిమిదేళ్ల బాలికను వడా పావ్ ఇస్తానని పిలిచాడు. దాంతో ఆ బాలిక వృద్ధుని ఇంటికి వెళ్లింది.
	
	అనంతరం ఆమెపై వృద్ధుడు అత్యాచారం చేసి విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కాగా, జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు.
	 
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
