పాలేరు డ్యాంలో 7 అడుగుల కొండచిలువ | 7 foot python found in paleru dam | Sakshi
Sakshi News home page

పాలేరు డ్యాంలో 7 అడుగుల కొండచిలువ

Oct 19 2016 10:54 AM | Updated on Sep 4 2017 5:42 PM

చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్య కారుడి వలలో ఓ కొండచిలువ చిక్కింది.

కూసుమంచి: చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్య కారుడి వలలో ఓ కొండచిలువ చిక్కింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయంలో బుధవారం చోటు చేసుకుంది. నాయకన్‌గూడెంనకు చెందిన షేక్ మన్సూర్ అనే మత్స్యకారుడు పాలేరు జలాశయంలో మంగళవారం చేపల కోసం వల వదిలి ఇంటికి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం వచ్చి వలను చూడగా అందులో కొండచిలువ ఉంది. తోటి మత్స్యకారులకు కొండచిలువను చంపేశారు. వలకు చిక్కిన కొండచిలువ సుమారు 7 అడుగుల పొడవు ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement