breaking news
paleru dam
-
పాలేరు జలాశయంలో చేపపిల్లల విడుదల
ఖమ్మం : మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ బుధవారం ఉదయం పాలేరు జలాశయంలో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో 70 కోట్ల చేపపిల్లలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ వర్తింపచేస్తామన్నారు. ప్రతి గొర్రె పిల్లకు బీమా సదుపాయం ఉందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు గొర్రెల పంపిణీని విమర్శించడం విడ్డూరమని కోపోద్రిక్తులయ్యారు. ఈ నెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సంచార వైద్యశాలలు ప్రారంభిస్తామని మంత్రి తలసాని తెలిపారు. -
పాలేరు డ్యాంలో 7 అడుగుల కొండచిలువ
కూసుమంచి: చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్య కారుడి వలలో ఓ కొండచిలువ చిక్కింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయంలో బుధవారం చోటు చేసుకుంది. నాయకన్గూడెంనకు చెందిన షేక్ మన్సూర్ అనే మత్స్యకారుడు పాలేరు జలాశయంలో మంగళవారం చేపల కోసం వల వదిలి ఇంటికి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం వచ్చి వలను చూడగా అందులో కొండచిలువ ఉంది. తోటి మత్స్యకారులకు కొండచిలువను చంపేశారు. వలకు చిక్కిన కొండచిలువ సుమారు 7 అడుగుల పొడవు ఉంది.