
త్వరలో యువరాజ్ పెళ్లి?
భారత క్రికెట్ ప్లేబోయ్‌గా పేరు తెచ్చుకున్న డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా త్వరలోనే తన బ్రహ్మచారి జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టనున్నాడా?
ముంబై: భారత క్రికెట్ ప్లేబోయ్‌గా పేరు తెచ్చుకున్న డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా త్వరలోనే తన బ్రహ్మచారి జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టనున్నాడా? దీపావళి రోజున వివాహ శుభవార్త చెబుతాడా? ఇప్పుడు యువీ అభిమానులంతా ఇదే విషయం చర్చించుకుంటున్నారు. ఎందుకంటే రెండు రోజుల క్రితం ఓ ఇంటివాడైన హర్భజన్ సింగ్‌తో జరిపిన ట్వీట్స్ ద్వారా యువీ తన పెళ్లిపై ఊహాగానాలకు తెర తీశాడు. ముందుగా తను భజ్జీకి శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఇక ఇప్పుడు ఎలాంటి దూస్రాలు వేయకు మిత్రమా.. లైన్‌కు కట్టుబడి ఉండు’ అని సరదాగా ట్వీట్ చేశాడు. పనిలో పనిగా భజ్జీ శ్రీమతి గీతా బస్రా కూడా.. ఇక లైన్లో తర్వాత ఉన్నది మీరే అంటూ యువీకి ట్వీట్ చేసింది.
దీనికి వెంటనే స్పందించిన భజ్జీ ‘నీవు కూడా లైన్‌లోకి రా.. ‘స్ట్రెయిట్’గా ఆడు.. పుల్, కట్ ఆడకు’ అని నర్మగర్భంగా స్పందించాడు. యువీ కూడా వెంటనే సమాధానమిస్తూ.. ‘యెస్.. మిస్టర్ హర్భజన్.. దీపావళి నుంచి నేరుగానే ఆడబోతున్నాను’ అని ముగించాడు. దీంతో పండుగ రోజు తన పెళ్లి గురించి ఏమైనా కబురు చెబుతాడా అని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
Can't bowl the dusra now buddy Stick to one line 😄! Wish @harbhajan_singh and @Geeta_Basra a happy life together love u both 😘💃🏼👏🏽🎉🎊❤️
— yuvraj singh (@YUVSTRONG12) October 28, 2015
@YUVSTRONG12 u should also come in a line and play straight now. No cut pull 😂😂😂😛😛😛
— Harbhajan Singh (@harbhajan_singh) October 29, 2015
😄 yes mr @harbhajan_singh from Diwali onwards I'm going to play straight see u Tom night 💃🏼🎊🎉
— yuvraj singh (@YUVSTRONG12) October 30, 2015
@YUVSTRONG12 @harbhajan_singh thank you Yuvi! We love you too ❤️you're next in line 😜
— Geeta Basra (@Geeta_Basra) October 29, 2015