అప్పుడు రైనాకే ధోని ఓటేశాడు: యువీ

Yuvraj Says MS Dhoni Really Backed Suresh Raina 2011 World Cup Time - Sakshi

హైదరాబాద్‌: ప్రతీ సారథికి జట్టులో ఒక అభిమాన అటగాడు ఉంటాడని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తెలిపాడు. అదేవిధంగా ప్రపంచకప్‌-2011 సమయంలో అప్పటి సారథి ఎంఎస్‌ ధోనికి జట్టులో ఇష్టమైన ఆటగాడు సురేష్‌ రైనా అని పేర్కొన్నాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2007లో స్టువార్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు కొట్టాక మ్యాచ్‌ రిఫరీ తన బ్యాట్‌ను పరిశీలించాడని వివరించాడు. అంతేకాకుండా విదేశీ క్రికెటర్లు, కోచ్‌లు కూడా తన బ్యాట్‌పై అనుమానం వ్యక్తం చేశారన్నాడు. అయితే ఆ బ్యాట్‌కు తనకెంతో ప్రత్యేకమైనదన్నాడు. 

‘ప్రతీ కెప్టెన్‌కు జట్టులో అభిమాన ఆటగాడు అంటూ ఒకరుంటాడు. అదేవిధంగా ప్రపంచకప్‌-2011 సమయంలో రైనాకు ధోని మద్దతు పుష్కలంగా ఉంది. నాకంటే ఎక్కువ సపోర్ట్‌ రైనాకే ధోని ఇచ్చాడు. యుసఫ్‌ పఠాన్‌ నిలకడగా రాణిస్తుండటం, ఆల్‌రౌండర్‌ కోటాలో నేను ఫామ్‌లో ఉండటం, అదే సమయంలో రైనా ఫామ్‌లో లేకపోవడంతో తుదిజట్టును ఎంపిక చేయడం ధోనికి తలకుమించిన భారం అయింది. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జట్టులో లేకపోవడంతో నన్ను జట్టులోకి తీసుకోవడం అనివార్యం అయింది. ఇక పఠాన్‌ను లీగ్‌ మ్యాచ్‌ల్లో ఆడించినా అంతగా ఆకట్టుకోకపోవడంతో అతడిని తప్పించి రైనాను జట్టులోకి తీసుకున్నారు. సౌరవ్‌ గంగూలీ నాకిష్టమైన సారథి. నాలాంటి నలుగురైదురుగు ప్రతిభ గల యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకొ​చ్చి అవకాశం ఇచ్చాడు. ఎంకరేజ్‌ చేశాడు’అని యువీ వ్యాఖ్యానించాడు. 

చదవండి:
'ఆ మ్యాచ్‌లో అతడు వాడిన బ్యాట్ నాదే'
వివాదాలు వద్దు.. ఆ ట్వీట్‌ను తీసేయ్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top