'ఆ మ్యాచ్‌లో మియాందాద్ వాడిన బ్యాట్ నాదే'

Javed Miandand Used Akram Bat In 1986 Asia Cup Final - Sakshi

క‌రాచి : సాధార‌ణంగా భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హైవోల్టేజ్ లెవ‌ల్లో ఉంటుంది. ఇరు జ‌ట్ల‌లో ఎవ‌రు గెలిచినా , ఓడినా అభిమానుల‌ను ఆప‌డం ఎవ‌రిత‌రం కాదు. ఇక ఫైన‌ల్లో ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డితే ఆ మజా ఎలా ఉంటుందో ఇప్ప‌టికే చాలా మ్యాచ్‌ల్లో  చూశాం. స‌రిగ్గా 34 ఏళ్ల‌ క్రితం ఇదే రోజున‌(ఏప్రిల్ 18) భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఆసియా క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. అస‌లే ఫైన‌ల్ మ్యాచ్‌.. ఆపై  ఉత్కంఠంగా జ‌రిగింది. షార్జా క్రికెట్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన‌ దాయాదుల పోరు ఇప్ప‌టికి అభిమానుల మదిలో మెదులుతూనే ఉన్న‌ది. ('నీలాంటి వాళ్ల‌తో నా ప్ర‌వ‌ర్త‌న ఇలాగే ఉంటుంది')

ఉత్కంఠంగా సాగిన ఆ మ్యాచ్‌లో లాస్ట్ బాల్‌కు నాలుగు ప‌రుగుల అవ‌స‌రం కాగా జావేద్ మియాందాద్ ' సిక్స్ కొట్ట‌డంతో పాక్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఆ విష‌యం ప‌క్క‌న‌పెడితే ఇదే మ్యాచ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న జ‌రిగింది.  ఈ మ్యాచ్‌లో మియాదాంద్  అక్ర‌మ్ బ్యాట్‌తో బరిలోకి దిగాడంట‌. అదే బ్యాట్‌తో త‌న ఇన్నింగ్స్ కొన‌సాగించిన మియాందాద్ చేత‌న్ శ‌ర్మ వేసిన ఆఖ‌రి ఓవ‌ర్లో ఆఖ‌రి బంతికి సిక్స్ కొట్టి పాక్ జ‌ట్టుకు అప‌రూప విజ‌యాన్ని అందించాడు. వ‌సీం అక్ర‌మ్ ఈ విష‌యాన్ని శ‌నివారం  ట్విట‌ర్ వేదిక‌గా పేర్కొన్నాడు.

'ఆరోజు జ‌రిగిన మ్యాచ్‌లో మియాందాద్ నా బ్యాట్‌నే ఉప‌యోగించాడు. ఫైన‌ల్ మ్యాచ్‌లో మియాందాద్ ఆఖ‌రి బంతికి కొట్టిన సిక్స్ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతుంది. ఆఖ‌రి బంతికి ఏ మాత్రం త‌డ‌బ‌డ‌కుండా సిక్స్ కొట్టిన మియాందాద్ ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కానీ మియాదాంద్ సిక్స్ కొట్టిన బ్యాట్ నాదే. అంత గొప్ప మ్యాచ్‌లో నేను భాగ‌స్వామిన‌యినందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఇది జ‌రిగి 34 ఏళ్లు అయినా ఇంకా నా మ‌దిలో మెలుగుతూనే ఉంది' అని అక్ర‌మ్ చెప్పుకొచ్చాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top